News April 25, 2024
చిత్తూరు: కర్ణాటక ఓటర్లకు సెలవు

చిత్తూరు జిల్లాలోని వివిధ సంస్థలు, పరిశ్రమలు, దుకాణాల్లో పనిచేసే కర్ణాటకకు చెందిన ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. కర్ణాటకలో ఈ నెల 26, మే 7వ తేదీన రెండు దశలుగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పనిచేస్తున్నవారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
చిత్తూరు: పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు.!

చిత్తూరు జిల్లాలో ఓ జంటకు పెళ్లై 21 ఏళ్లలో 14 మంది పిల్లలు పుట్టారంటే నమ్మండి. వీరిలో 7 మంది మగ పిల్లలు, 7 మంది ఆడపిల్లలు జన్మించగా.. వారిలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. GDనెల్లూరు(M) ఆవల్ కండ్రిగకు చెందిన దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో సదరు మహిళ గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ బిడ్డగా మగ పిల్లాడికి జన్మనిచ్చింది.
News December 19, 2025
చిత్తూరు: అర్జీల పరిష్కారంలో వెనుకబాటు.!

PGRS వినతుల పరిష్కారంలో చిత్తూరు జిల్లా వెనుకబాటులో ఉంది. కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు నివేదిక వెలువడింది. నిర్దేశించిన గడువులో వాటిని పరిష్కరించకపోవడంతో ఈ విభాగంలో జిల్లా 7.27%తో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. అర్జీల రీ ఓపెన్లో 14.52 శాతంతో మూడో స్థానంలో ఉంది. LPM తిరస్కరణలో 28.85 శాతంతో మూడో స్థానంలో ఉంది.
News December 19, 2025
చిత్తూరు: 1447 మంది గైర్హాజరు.!

చిత్తూరు జిల్లాలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం పాఠశాలల్లో వందరోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు 1447 మంది విద్యార్థులు గైర్హాజరవుతున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1529 మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక తరగతులకు 13,762 మంది మాత్రం హాజరవుతున్నట్టు వెల్లడించారు. అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.


