News February 1, 2025

చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన నగరి DSP 

image

చిత్తూరు జిల్లా సచివాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్‌ను నగరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఎస్పీ మహమ్మద్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ.. నగరి డివిజన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందికర సమస్యలు ఉంటే తనను సంప్రదించవచ్చని, తగిన న్యాయం చేస్తామని తెలిపారు. తాను ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటానని తెలిపారు.

Similar News

News November 12, 2025

చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు గమనిక

image

జిల్లాలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 రుసుంతో డిసెంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు, రూ.500తో డిసెంబర్ 11 నుంచి 15 వరకు అవకాశం ఉంటుందన్నారు.

News November 12, 2025

చిత్తూరులో ఏక్తా దివస్ ర్యాలీ

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం చిత్తూరులో రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పాల్గొన్నారు. గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.

News November 12, 2025

నేడు జిల్లా వ్యాప్తంగా 10,168 గృహ ప్రవేశాలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 10,168 గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మరోవైపు PMAY 2.O క్రింద 2,472 ఇళ్లులు మంజూరు కాగా వాటి లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1లక్షను అందించనుంది.