News February 1, 2025

చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన నగరి DSP 

image

చిత్తూరు జిల్లా సచివాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్‌ను నగరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఎస్పీ మహమ్మద్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ.. నగరి డివిజన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందికర సమస్యలు ఉంటే తనను సంప్రదించవచ్చని, తగిన న్యాయం చేస్తామని తెలిపారు. తాను ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటానని తెలిపారు.

Similar News

News February 19, 2025

చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

image

చిత్తూరు జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.

News February 19, 2025

ఐరాల: మహిళా ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి

image

మహిళా బ్యాంకు ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. కాణిపాకంకు చెందిన భూపాల్ వైఎస్ గేటులో ఉన్న ఓ బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను చిత్తూరు నుంచి బస్సులో వస్తుండగా నిత్యం వేధిస్తున్నాడు. ఈ వేధింపులపై ఆగ్రహించిన స్థానికులు అతనిని కరెంటు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు.

News February 19, 2025

చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై <<>>క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

error: Content is protected !!