News January 19, 2025

చిత్తూరు: కానిస్టేబుల్ అప్పీల్ కార్యక్రమం వాయిదా

image

ఈ నెల 20వ తేదీన జరగవలసిన కానిస్టేబుల్‌ల అప్పీల్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.  అప్పీల్ చేయవలసిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తల్లితండ్రులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాంటివారు ఎవరైనా ఉంటే 112, 9440900005 నంబర్లకు మెసేజ్ చేయాలని కోరారు.

Similar News

News December 9, 2025

చిత్తూరు: 12న అంగన్వాడీల ఆందోళన

image

అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12వ తేదీ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని యూనియన్ లీడర్ సరస్వతి తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పులిచెర్లలో సీడీపీవోకు అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పథకాలు అమలు చేయాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు, జీతాలు పెంచాలని, మెడికల్ లీవ్ ఇవ్వాలని, పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు.

News December 9, 2025

చిత్తూరు: ముగిసిన పులుల గణన

image

జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో పులుల గణన సోమవారం ముగిసింది. 4.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతంలో చిత్తూరు ఈస్టు, వెస్టు, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్‌కు ఉన్నాయి. వీటి పరిధిలో 24 సెక్షన్లు, 84 బీట్ల సిబ్బంది గణన ప్రక్రియలో పాల్గొన్నారు. నాలుగేళ్లకోసారి ఈ గణనను అధికారులు నిర్వహిస్తున్నారు.

News December 9, 2025

చిత్తూరు జిల్లాలో మరో ఇద్దరికి స్క్రబ్ టైఫస్

image

చిత్తూరు జిల్లాలో సోమవారం మరో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు బయట పడ్డాయి. జీడీనెల్లూరు మండలంలోని ముత్తుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తవణంపల్లి మండలం పల్లెచెరువు గ్రామానికి చెందిన మరో వ్యక్తి స్క్రబ్ టైఫస్‌తో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.