News January 29, 2025
చిత్తూరు: కూతురిని రూ. 25 వేలకు అమ్మిన కసాయి తండ్రి

కూతురిని రూ. 25 వేలకు అమ్మిన కసాయి తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన రమణయ్య దంపతులకు ముగ్గురు మగ పిల్లలు, ఏడుగురు ఆడపిల్లలు సంతానం. నగరి సమీపంలో రమణయ్య కుటుంబం బాతులు మేపుతుండేవారు. భార్య అనారోగ్యం కావడంతో తన ఐదో కూతురు మల్లిక(10)ను నగరికి చెందిన బాలాజీకి రూ.25 వేలకు అమ్మాడు. చిన్నారిని గ్రామస్థులు రక్షించి పోలీసులకు అప్పగించారు. RK పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 14, 2025
చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు చర్యలు

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయదారులకు సహకరించని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలకు ప్రభుత్వం అందించే రాయితీలను నిలుపుదల చేయాలని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు.
News October 14, 2025
చిత్తూరు: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సుకు దరఖాస్తులు

అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు చేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు.APPSDC స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ఉచిత అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కోర్సుకు 5 నుంచి ఏదైన ఉన్నత విద్యవరకు చదివిన వారు అర్హులన్నారు. ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 14, 2025
చిత్తూరు: 17న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

ఈనెల 17న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలియజేశారు. జిల్లాలోని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల విద్యార్థులు మాత్రమే ఈ సెమినార్ పోటీలకు అర్హులన్నారు. క్వాంటం యుగం ప్రారంభం-అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 17న ఉ.10 గంటలకు జిల్లా కేంద్రం లోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సెమినార్ పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.