News March 24, 2024
చిత్తూరు : కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన

చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన నిర్వహించారు. వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్సై షేక్షావల్లి, టూ టౌన్ సిఐ ఉలసయ్య , ఎస్సై ప్రసాద్ పోలీసు సిబ్బంది నగరంలోని పలు ప్రధాన క్రీడలలో కవాతు నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల్లో గొడవలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 11, 2025
CM సొంత నియెజకవర్గంలో గ్రానైట్ అక్రమ రవాణా.?

అది CM సొంత నియోజకవర్గం. అన్నిరంగాల్లో ముందుడాలని చంద్రబాబు అభివృద్ధి అంటుంటే.. ఆ పార్టీ నాయకులు మాత్రం అందినకాడికి దోచుకో.. దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారట. కుప్పం గ్రానైట్‌కు మంచి డిమాండ్ ఉంది. దీంతో నాయకులు పగలు గ్రావెల్ రాత్రిళ్లు గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారట. YCP హయాంలో చంద్రబాబు దీనిపై క్వారీలోకి వెళ్లి మరీ పరిశీంచారు. మరి ఇప్పటి అక్రమ రవాణాపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
News December 11, 2025
చిత్తూరు: మైనర్ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4,100 జరిమానాను కోర్టు విధించినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు వెదురుకుప్పం(M) వెంగనపల్లెకు చెందిన మణి ఓ మైనర్ బాలికను ప్రేమించాలని వేధించాడు. 2020లో ఆమెను భయపెట్టి భాకరాపేటకు తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News December 11, 2025
చిత్తూరు కలెక్టర్‌కు 6వ ర్యాంకు

రాష్ట్రంలోనే అందరి కంటే ఎక్కువగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఎక్కువ ఫైల్స్ స్వీకరించారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 1,555 ఫైల్స్ తీసుకుని 1,421 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను ఒకరోజు 6గంటల వ్యవధిలోనే క్లియర్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు మన కలెక్టర్‌కు రాష్ట్రంలో 6వ ర్యాంకు ఇవ్వగా.. 843 ఫైల్స్‌కు గాను 740 క్లియర్ చేయడంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్‌కు 12వ ర్యాంకు వచ్చింది.


