News January 11, 2025
చిత్తూరు: కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు
సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు,ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించడం పూర్తిగా నిషిద్ధమని SP మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఎవరైనా ఈ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా, సంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాడ్పడినా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీటిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News January 17, 2025
20 నుంచి తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 10 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీ నుంచి టీటీడీ సర్వదర్శనం భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. అధికారులతో సమీక్ష అనంతరం 20వ తేదీ నుంచి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. అదేవిధంగా ప్రోటోకాల్ మినహా 20న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
News January 17, 2025
బాలయ్య అభిమానులకు షాక్ ఇచ్చిన తిరుపతి పోలీసులు
డాకు మహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా పొట్టేలును బలిచ్చిన ఐదుగురు బాలకృష్ణ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. SI బాలకృష్ణ వివరాల ప్రకారం.. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఐదుగురు బాలకృష్ణ అభిమానులు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ ఎదుట ఈనెల 12న పొట్టేలును బలిచ్చి ఆ రక్తం సినిమా పోస్టర్‌కు అంటించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
News January 17, 2025
చిత్తూరు జిల్లా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి
కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పారదర్శకంగా, పూర్తిగా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు దళారులను మధ్యవర్తులను నమ్మకుండా, మోసపోకుండా ఉండాలని సూచించారు. ఎవరైనా తాము భర్తీకి సహకరిస్తాము అని చెబితే డయల్ 112కు గాని చిత్తూరు పోలీసు వాట్సప్ నం. 9440900005కు గాని ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.