News September 2, 2024
చిత్తూరు: గబ్బర్ సింగ్ రీ రిలీజ్.. థియేటర్‌లో ఎమ్మెల్యే హంగామా
చిత్తూరు పట్టణంలోని ఎమ్మెస్సార్ థియేటర్లో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సోమవారం గబ్బర్ సింగ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. అభిమానులతో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సినిమా థియేటర్లో హంగామా చేశారు. సినిమాను తిలకించారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు.
Similar News
News September 12, 2024
CTR: వినాయకుడికి ముస్లిం సోదరుల పూజలు
చిత్తూరు జిల్లాలో ముస్లిం సోదరులు వినాయకుడికి పూజలు నిర్వహించి వారెవ్వా అనిపించారు. పులిచెర్ల మండలం కె.కొత్తకోటకు చెందిన ముస్లిం సోదరులు షేక్ ఫిరోజ్ బాషా, షేక్ చాంద్ బాషా గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఏడు దేవతామూర్తులు ఉన్న గుడిలో గణనాథుడికి పూజలు నిర్వహించారు. ఇలా మతసామరస్యం చాటిన ఆ సోదరులను అందరూ అభినందిస్తున్నారు.
News September 12, 2024
చిత్తూరు జిల్లా నేతలతో జగన్ సమాలోచనలు
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు ఇవాళ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు జిల్లాలోని పరిస్థితులను మాజీ సీఎంకు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడాలని జగన్ సూచించారు. ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
News September 12, 2024
ఆరుగురు డాక్టర్లతో ఆదిమూలం బాధితురాలికి పరీక్షలు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలకి తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులతో పరీక్షలు చేశారు. ఎక్స్‌రే తీశారు. రక్త, వీడిఆర్ఎల్ పరీక్షలు చేసి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మెటర్నిటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షలను రెండు సార్లు వాయిదా వేసినా.. మూడోసారి బాధితురాలు పరీక్షలకు హాజరయ్యారు.