News June 28, 2024

చిత్తూరు జడ్పీ పూర్వ సీఈవోపై వేటు

image

చిత్తూరు జడ్పీ సీఈవోగా గతంలో పని చేసిన ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. బైరెడ్డిపల్లె ఎంపీడీవోగా ఉన్న ఆయనకు సీఈవోగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన అనేక అక్రమాలు చేశారని టీడీపీ నేతలు నరసింహులు, గీర్వాణి ఆరోపించారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలు నిజమేనని నిర్ధారించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Similar News

News December 17, 2025

సమావేశానికి హాజరైన చిత్తూరు కలెక్టర్

image

జిల్లా కలెక్టర్‌లతో సీఎం చంద్రబాబు అమరావతిలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులే కీలకమని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని ఆదేశించారన్నారు.

News December 17, 2025

22న మామిడి రైతుల చలో కలెక్టరేట్

image

చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘ విస్త్రృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.

News December 16, 2025

చిత్తూరు: నూతన పోలీసుకు SP సూచనలు.!

image

చిత్తూరు జిల్లాలో ఎంపికైన పోలీసు కానిస్టేబుల్లు వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో 22వ తేదీ నుంచి వచ్చే నెల 9 నెలల ఇండక్షన్ శిక్షణ పొందవలసి ఉందని SP తుషార్ డూడీ తెలిపారు. ఎంపికైన వారు 20వ తేదీ ఉ.9 గం.లకు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు రావాలన్నారు. వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్, 6 ఫొటోలు, రూ.100 బాండ్‌తో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ 9 నెలలు ఉండనుంది.