News February 28, 2025
చిత్తూరు: జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు పెంపు

జిల్లాలో ఫిబ్రవరి 28 తో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్ను పొడిగిస్తూ సమాచార పౌర సంబంధ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. మార్చి 1 నుంచి మే 31 వరకు లేక కొత్త కార్డులు మంజూరు చేయడం ఏది ముందు జరిగితే అప్పటివరకు కాల పరిమితిని పొడిగించినట్లు ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28 నాటికి అక్రిడేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందన్నారు.
Similar News
News February 28, 2025
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: జిల్లా ఎస్పీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. జిల్లాలో సీఎం పర్యటన సందర్బంగా ట్రయిల్ రన్ నిర్వహించారు. మార్చి నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు విధులలో పాల్గొనే పోలీసు అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
News February 28, 2025
గుడిపల్లి : మామిడి తోటలో ఏమేం దొరికాయి అంటే..?

ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ మామిడి తోటలో దొరకడం కలకలం రేపుతోంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రం తీసుకునే రిజిస్టర్లతో పాటు క్వశ్చన్ పేపర్లను భద్రపరిచిన లాకర్ కీ, ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్, కస్టోడియల్ అధికారి వద్ద ఉండాల్సిన రెండు రిజిస్టర్లు, ప్రశ్నాపత్రం కోడ్ రిసీవింగ్కు సంబంధించిన అధికారిక ఫోన్, ఎగ్జామ్కు సంబంధించిన పలు పేపర్లు పడి ఉన్నట్లు తెలుస్తోంది.
News February 28, 2025
రోడ్డు ప్రమాదంలో చిత్తూరు వాసి దుర్మరణం

గూడూరు ఆదిశంకర College వద్ద నిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని TATA AC ఢీకొనడంతో చిత్తూరుకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.