News February 25, 2025
చిత్తూరు జాయింట్ కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్లను నిర్దేశిత ధరలకే విక్రయించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి సూచించారు. కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తే చర్యలు ఉంటాయన్నారు. పలు ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. అలాంటి ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ ఎంత ధరకు ఇస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News February 25, 2025
తిరుమలలో చైన్ స్నాచర్ హల్‌చల్

తిరుమలలో ఓ దొంగ హల్‌చల్ చేశాడు. భక్తురాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో తోటి భక్తులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం టీటీడీ, పోలీస్ విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన తిరుమలలోని మాధవం అతిథిగృహం వద్ద జరిగింది.
News February 25, 2025
CM చిత్తూరు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..

సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. మార్చి 1న ఆయన జీడీనెల్లూరుకు రానున్నారు. శనివారం 11.25కి రేణిగుంటకు వస్తారు. 11.50కి హెలికాప్టర్ ద్వారా జీడీనెల్లూరుకు వెళ్తారు. అక్కడ పింఛన్లు పంపిణీ చేస్తారు. తర్వాత గ్రామస్థులతో మాట్లాడతారు. 2.30 తర్వాత తిరిగి రేణిగుంట వెళ్తారు. ఈనేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
News February 25, 2025
మొగిలి: హంస వాహనంపై మొగిలేశ్వర స్వామి

బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో వెలసిన మొగలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు స్వామివారు హంస వాహనంపై గ్రామంలో ఊరేగారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించారు.