News March 20, 2024
చిత్తూరు జిల్లాకు చేరిన ఓటర్ ఎపిక్ కార్డులు

రాష్ట్ర ఎన్నికల సంఘం ముద్రించిన 1.11 లక్షల ఓటరు ఎపిక్ కార్డులు చిత్తూరు కలెక్టరేట్‌కు చేరాయి. ఈనెల 17న 81 వేలు, ఈనెల 18న 30 వేలు మొత్తం 1.11 లక్షల కార్డులు వచ్చినట్టు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. వీటిని స్కాన్ చేసి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు పంపారు. ఆ శాఖ నుంచి జిల్లాలోని సంబంధిత ఓటర్ల చిరునామాకు పోస్టు ద్వారా చేరవేయనున్నారు.
Similar News
News February 12, 2026
చిత్తూరు జిల్లాలో మీకు ఈ విషయం తెలుసా?

కంగి, కంగడు అనే బందిపోటు దొంగలు 1066-1132 మధ్య కుప్పం ప్రాంతానికి అధిపతులుగా పాలించారు. దట్టమైన అరణ్యంలో ఎరుకలు, యానాది కులాలకు చెందిన బందిపోటు దొంగలు అక్కడక్కడ స్థావరాలను ఏర్పరచుకున్నారు. నాటి పాలకుల పేరును చిరస్థాయిగా నిలిపేలా ఈ ప్రాంతానికి కంగుంది దుర్గం అనే పేరు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. తర్వాత జమీందారుల పాలన కొనసాగుతూ 1950 వరకు సుమారు 884 ఏళ్లు ఈ కోట రాజధానిగా ఉండేది.
News February 12, 2026
చిత్తూరు: పరీక్షల్లో అధికారుల ఫెయిల్.. 19మందిపై చర్యలు

రెవెన్యూ శాఖలో తాత్కాలిక షరతులతో సీనియర్ అసిస్టెంట్లుగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. శాఖాపరమైన పరీక్షల్లో పాస్ కాకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మందిని తిరిగి గ్రేడ్-1 వీఆర్వోలుగా రివర్షన్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరు శాఖపరమైన పరీక్షల్లో అనుకున్న మేర ఫలితాలు సాధించకపోవడంతో రివర్షన్ ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు.
News February 11, 2026
చిత్తూరు: బీపీఎస్ పథకానికి స్పందన ఏది?

చిత్తూరు జిల్లాలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకానికి తగినంతగా ఆదరణ లభించడం లేదు. ఇప్పటివరకు 300 లోపే దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో చిత్తూరు నగరపాలక పరిధిలోనే 200 పైగా ఉన్నాయని తెలుస్తోంది. 2019లో జిల్లాలో ఇందుకోసం సుమారు 2000 దరఖాస్తులు వస్తే రూ.9 కోట్ల ఆదాయం చేకూరింది. ప్రస్తుతం మార్చిలో గడువు ముగియనుండడంతో అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.


