News October 16, 2024
చిత్తూరు జిల్లాలోనూ రేపు సెలవు

చిత్తూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం కూడా సెలవు ప్రకటించారు. సెలవు ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో కాసేపటి క్రితమే రేపటికి సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.
Similar News
News November 25, 2025
5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
News November 25, 2025
మదనపల్లెలోకి పుంగనూరు.. తిరుపతిలోకి నగరి

చిత్తూరు జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను కొత్తగా ఏర్పడబోయే మదనపల్లె జిల్లాలో చేరుస్తారు. నగరి డివిజన్ మొత్తాన్ని తిరుపతి జిల్లాలోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురాన్ని తిరుపతిలో కలిపి.. పాలసముద్రాన్ని చిత్తూరు డివిజన్లోకి మారుస్తారని సమాచారం. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతిలో కలపాలనే ప్రజల డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోలేదు.
News November 24, 2025
చిత్తూరు: ప్రియురాలిని చంపిన ప్రియుడు.. పరార్.!

ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైన ఘటన ఇది. స్థానికుల వివరాల మేరకు.. రామసముద్రం(M) బిక్కింవారిపల్లెకు చెందిన దేవిశ్రీ(22) బెంగళూరులో BBA చదువుతోంది. అక్కడ చౌడేపల్లి(M) పెద్దకొండామరికి చెందిన గోవర్ధన్ పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆదివారం రాత్రి ఆమెను గోవర్ధన్ హత్య చేసి పరారైనట్లు బెంగళూరు తమ్మినహళ్లి PSలో కేసు నమోదు అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


