News August 13, 2024
చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేది ఇక్కడే
ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. 16 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్లను ఈ పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు.
*కుప్పం : రాధాకృష్ణ రోడ్డు
*పలమనేరు : Beside Anna canteen
*పుంగనూరు : పంచాయతీ రాజ్ ఆఫీస్
*మదనపల్లె : అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్
: Weekly Market
Similar News
News September 17, 2024
20వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్
కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 17, 2024
తిరుపతి: చాట్ బాట్ ద్వారా 310 ఫోన్లు రికవరీ
చాట్ బాట్ ద్వారా11వ విడతలో రూ.62 లక్షల విలువ గల 310 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…10 విడతలలో సుమారు రూ.6, 07 కోట్లు విలువచేసే 3,530 సెల్ ఫోన్లు బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వాట్సప్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.
News September 17, 2024
తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం
తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని FactCheck.AP.Gov.in పేర్కొంది. వాస్తవానికి ఆగస్టు 29వ తేదీన విజయవాడ గురునానక్ కాలనీలో, మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్ వీడియో ఇది అని తెలిపింది. తిరుమల ప్రతిష్ట మంటగలిపేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని ట్విటర్‌లో తెలిపింది.