News August 1, 2024

చిత్తూరు జిల్లాలో ఉదయం 11 కే 90.28% పెన్షన్ పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. ఉదయం 11 గం. ల వరకు 90.28% పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి-96.97, నగరి-94.99, విజయపురం-94.43, చిత్తూరు -94, పుంగనూరు-92, పెద్దపంజాని -92, కార్వేటినగరం-92, ఐరాల-92, నిండ్ర-92, పుంగనూరు-91, పులిచెర్ల-91, పలమనేరు-91, సోమల-91 పంపిణీ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

Similar News

News January 20, 2026

క్రైం డేటాను నవీకరించాలి: చిత్తూరు ఎస్పీ

image

క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాను తక్షణమే నవీకరించాలని.. క్రమం తప్పకుండా అప్ డేట్ చేయాలని ఎస్పీ తుషార్ ఆదేశించారు. పోలీస్ గెస్ట్ హౌస్ లో మంగళవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ క్రైమ్ ఉచ్చులో ప్రజలు పడకుండా చూడాలన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

News January 20, 2026

చిత్తూరు: ‘సైనికుల త్యాగాలను తెలియజేయాలి’

image

సైనికుల త్యాగాలను విద్యార్థులకు తెలియజేయాలని ఎస్పీ తుషార్ సూచించారు. చిత్తూరు పట్టణంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ జాతీయ సైనికుల దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. జమ్ములో టెర్రరిస్టుల దాడిలో మృతి చెందిన అమరవీరుడు కార్తీక్ చిత్ర పటానికి ఆయన నివాళులు అర్పించారు. మనం ప్రశాంతంగా ఉన్నామంటే సరిహద్దుల్లో సైనికుల కృషియేనని ఆయన కొనియాడారు.

News January 20, 2026

పలమనేరు: 23 ఏనుగులు మృతి!

image

కౌండిన్య అభయారణ్యంలో నిన్న మొదటి ఏనుగు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా అటవీ పరిధిలో ఇప్పటివరకు 23 ఏనుగులు మృతి చెందాయి. గత పది ఏళ్లలో 15 ఏనుగులు కరెంట్ షాక్‌తోనే మృతి చెందాయి. ఏనుగులకు ప్రమాదాలు వాటిల్లకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.