News February 18, 2025
చిత్తూరు జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల గరిష్ఠంగా నమోదవుతాయన్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 23, 2025
చంద్రగిరి కోట అభివృద్ధికి గ్రహణం వీడేనా.?

ఉ.చిత్తూరు జిల్లా సిగలో మరో మణిహారం చంద్రగిరి కోట. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ కోట అలనాటి స్వర్ణయుగానికి ప్రతీక. శత్రు దుర్భేధ్యంగా నిర్మించిన బురుజులు, కోనేరు జిల్లాకే తలమానికం. కోటతోపాటూ అక్కడి మ్యాజియంలోని రాయలవారి వస్తువులను తిలకించడానికి ఎందరో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కోట అభివృద్ధికి అధికారులు మరిన్ని చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మీరేమంటారో కామెంట్ చేయండి.
News March 23, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరల వివరాలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.151 ఉండగా, బ్రాయిలర్ స్కిన్ లెస్ రూ. 172గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. లేయర్ కోడి మాంసం కిలో రూ.145కు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. మీ సమీప ప్రాంతాలలోని చికెన్ దుకాణాలలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 23, 2025
అన్న కోసం ఎదురు చూసి అనంతలోకాలకు

అన్న కోసం ఎదురు చూసిన చిన్నారి అనంతలోకాలకు వెళ్లిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. నగరి మండలం వీకేఆర్ పురం గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగనన్న కాలనీలో ఉంటున్న నోమేశ్వరి(10) మృతి చెందగా, ఆమె సోదరుడు మహేశ్ గాయపడిన విషయం తెలిసిందే. ఒంటిపూట బడి కావడంతో అన్న కోసం ఎదురు చూసిన నోమేశ్వరి.. మహేశ్ రాగానే ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.