News June 4, 2024

చిత్తూరు జిల్లాలో విజేతలు వీళ్లే

image

➤కుప్పం:చంద్రబాబు ➤పలమనేరు: అమరనాథ రెడ్డి
➤పూతలపట్టు: మురళీ ➤చిత్తూరు: జగన్మోహన్
➤GDనెల్లూరు: థామస్ ➤నగరి: గాలి భానుప్రకాశ్
➤సత్యవేడు: ఆదిమూలం ➤శ్రీకాళహస్తి: బొజ్జల
➤తిరుపతి: శ్రీనివాసులు ➤చంద్రగిరి: పులివర్తి నాని
➤పీలేరు: నల్లారి కిశోర్ ➤పుంగనూరు: పెద్దిరెడ్డి
➤మదనపల్లె:షాజహాన్➤తంబళ్లపల్లె:ద్వారకనాథరెడ్డి
NOTE: పుంగనూరు, తంబళ్లపల్లోనే వైసీపీ గెలిచింది.

Similar News

News November 10, 2024

చంద్రగిరి: కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధికి అడుగులు: మంత్రి

image

కూటమి ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. శనివారం హౌసింగ్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీ మోహన్ లతో కలసి మంత్రి పాల్గొన్నారు. హౌసింగ్ కాలనీలో ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. పలు సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కరించారు. 

News November 9, 2024

చిత్తూరు: హేమలత నేపథ్యం ఇదే.. 

image

నామినేటెడ్ పోస్టుల్లో చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా K.హేమలతను నియమించారు. గతంలో (2017) ఆమె చిత్తూరు మేయర్‌గా పనిచేశారు. మేయర్‌గా ఉంటూ హత్యకు గురైన కటారి అనురాధకు ఆమె మేనకోడలు. దీంతో ఆమెను అప్పట్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ అభివృద్ధికి కృషి చేశారు. పోలీసులు వేధిస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు.

News November 9, 2024

చిత్తూరు నేతలకు కీలక పదవులు

image

రెండో జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఛైర్మన్‌గా కె.హేమలత నియమితులయ్యారు. ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా నీలాయపాలెం విజయ్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఏపీ యాదవ్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నరసింహ యాదవ్, వన్నెకుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా CRరాజన్‌, నాయీ బ్రహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఆర్.సదాశివకు అవకాశం దక్కింది.