News December 24, 2024

చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నేడు ఆప్షనల్ సెలవు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఇవాళ ఆప్షనల్ సెలవును ప్రకటిస్తున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. తప్పనిసరిగా అన్ని పాఠశాలలు సెలవు ప్రకటించాలని ఆమె ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవన్నారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు ఈ నిబంధన వర్తించదు.

Similar News

News October 30, 2025

బాధిత కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ సాయం

image

ప్రమాదాలకు గురైన పోలీసు కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ గురువారం ఆర్థిక సాయం అందజేశారు. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మురుగేషన్, సాయుధ దళంలో విధులు నిర్వహిస్తున్న రవితేజ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు IDRF ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఎస్పీ చెక్కులను అందజేశారు. కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

News October 30, 2025

తుఫాన్‌ను సీఎం అద్భుతంగా ఎదుర్కొన్నారు: MP

image

చిత్తూరు: మొంథా తుఫాన్‌ను సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అద్భుతంగా ఎదుర్కొన్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కొనియాడారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించగలిగామని తెలిపారు. బాధితులకు సహాయం, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజలకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించారు.

News October 30, 2025

చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.