News March 17, 2025

చిత్తూరు జిల్లాలో MROల బదిలీ

image

చిత్తూరు జిల్లాలో ఏడు మంది MROలను బదిలీ చేస్తూ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఉత్తర్వులు జారీ చేశారు.
☞ వెదురుకుప్పం MROగా బాబు
☞ గంగవరం MROగా మాధవరాజు
☞ రామకుప్పం MROగా కౌలేష్
☞ పూతలపట్టు MROగా రమేశ్
☞ బైరెడ్డిపల్లి MROగా శ్యాం ప్రసాద్ రెడ్డి
☞ శాంతిపురానికి MROగా ప్రసన్నకుమార్‌ను 
☞ గుర్రప్పను చిత్తూరు కలెక్టరేట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News February 25, 2026

చిత్తూరు: పన్ను వసూళ్ల గడువు పెంపు

image

గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్ల గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల డీపీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పరిధిలో రూ.27.41 కోట్ల పన్ను వసూలు లక్ష్యంలో ఇప్పటివరకు రూ.18.63 కోట్లు(68 శాతం) వసూలైనట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. డీఎల్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

News February 24, 2026

చిత్తూరు- తిరుపతి హైవేపై ప్రమాదం

image

పూతలపట్టు మండలం వడ్డేపల్లి వద్ద ఓ వ్యక్తిని టెంపో వాహనం ఢీకొట్టింది. స్థానిక బిడారమిట్టకు చెందిన టి చెంగయ్య వడ్డేపల్లి వద్ద ఓ కళ్యాణమండపంలో జరుగుతున్న తమ సమీప బంధువు వివాహానికి హాజరు కావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో వాహనం చెంగయ్యను ఢీకొని రెండు కాళ్లపై మీదుగా వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 24, 2026

సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

image

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.