News February 13, 2025
చిత్తూరు జిల్లా నేతలకు కీలక పదవులు

చిత్తూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా KP. శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే చిత్తూరు రూరల్ అధ్యక్షుడిగా జయపాల్, గుడిపాల మండల అధ్యక్షుడిగా జై ప్రకాశ్‌ని నియమించారు. తమకు అవకాశం కల్పించిన జగన్, విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.
Similar News
News March 16, 2025
తిరుపతిలో దారుణం..!

తిరుపతిలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి క్రిందకు తోసేసింది. దీంతో 14 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి గోప్యంగా చికిత్సను స్కూల్ యాజమాన్యం అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 16, 2025
TDP నేతలపై MLA థామస్ ఆగ్రహం

పేదల అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అభివృద్ధికి అడ్డుపడితే సహించనని పలువురు TDP నేతలపై ఎమ్మెల్యే థామస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెనుమూరులో పర్యటించిన ఆయన.. కేవలం పార్టీలోని కొందరు నేతలు YCP నేతలతో తిరుగుతూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. తాను దేశాలు తిరిగిన నేతనని, అగ్రకులాల వారికి సలాం చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనను రెచ్చిగొడితే అంతు చూస్తానన్నారు.
News March 16, 2025
SP నుంచి ఉత్తమ CIగా ప్రశంస.. ఒక్కరోజులోనే సస్పెండ్

రెండు రోజుల క్రితం SP నుంచి ఉత్తమ పని తీరు కనబరిచిన CI.. 24 గంటలు గడవక ముందే సస్పెండ్ కావడం చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. పుంగనూరులో శనివారం రామకృష్ణ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో DIG ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన SP మణికంఠ.. పుంగనూరు CI శ్రీనివాసులు నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. దీంతో CIతోపాటూ హెడ్ కానిస్టేబుల్‌ను స్సస్పెండ్ చేశారు.