News September 12, 2024
చిత్తూరు జిల్లా నేతలతో జగన్ సమాలోచనలు

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు ఇవాళ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు జిల్లాలోని పరిస్థితులను మాజీ సీఎంకు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడాలని జగన్ సూచించారు. ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
Similar News
News January 6, 2026
చిత్తూరుకు పునర్విభజన ఎఫెక్ట్.. తగ్గిన గ్రామ పంచాయతీలు

చిత్తూరు జిల్లాకు పునర్విభజన పుణ్యమా అంటూ గ్రామ పంచాయతీలు తగ్గాయి. 696 గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా పునర్విభజన అనంతరం 75 గ్రామ పంచాయతీలు నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య మదనపల్లి జిల్లాలో కలిసిపోయాయి. దీంతో 621 గ్రామ పంచాయతీలకు చిత్తూరు జిల్లా పరిమితమైంది. ఇక మండలాల వారీగా పుంగునూరు, చౌడేపల్లి, సదుం మండలాలు మదనపల్లిలో కలవడంతో 32 ఉన్న మండలాలు 28 కి మాత్రమే పరిమితమైంది. దీంతో చిత్తూరు చిన్నదైంది.
News January 6, 2026
వి కోట: వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి మృతి చెందిన ఘటన వీకోట మండలంలో వెలుగు చూసింది. అంబేడ్కర్ నగర్‌కు చెందిన వినోద్ కుమార్ భార్య మేఘన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందారు. మృతురాలు బంధువులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News January 5, 2026
పలమనేరులో మాస్టర్ ప్లాన్ జీవో 277 విడుదల

పలమనేరు పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలుకు ముందడుగు పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.277 విడుదల చేసింది. గతంలో అమరనాథ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రత్యేక చొరవ చూపినా ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో వాయిదా పడింది. రాబోయే 20 సంవత్సరాల పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ మాస్టర్ ప్లాన్ తయారుచేసినట్లు అధికారులు చెబుతున్నారు.


