News October 13, 2024
చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరికలు

చిత్తూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. విపత్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ,పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు జారీ చేశారు.
Similar News
News October 18, 2025
శాంతిపురం : రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

శాంతిపురం (M) బడుగుమాకులపల్లి వద్ద బైకును కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కెనమాకులపల్లికి చెందిన వెంకటరామప్ప (55), సత్యప్ప (60) బైకుపై బడుగు మాకులపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా పలమనేరు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట రామప్ప అక్కడికక్కడే మృతిచెందగా, సత్యప్ప తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.
News October 18, 2025
చిత్తూరు: ఈ నెల 21న హాలిడే కోసం వినతి

ఈ నెల 20న దీపావళి పండుగ సందర్భంగా మరుసటి (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటించాలని APTF నాయకులు విద్యాశాఖాధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ కార్యాలయంలో AD సుకుమార్‌ను కలిసిన APTF నాయకులు ఆరోజు పలువురు కేదారేశ్వర స్వామి వ్రతం నిర్వహించుకుంటారని, కావున సెలవు ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుుంటారో వేచి చూడాలి.
News October 18, 2025
హంద్రీనీవాతో కుప్పం సస్యశ్యామలం

హంద్రీనీవాతో కుప్పం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. శాంతిపురం (M) దండి కుప్పం చెరువు కృష్ణ జలాలతో నిండి మరవ పోవడంతో శుక్రవారం టీడీపీ నేతలు జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పంకు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు మరో భగీరథ ప్రయత్నం చేశారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు.