News September 29, 2024
చిత్తూరు: జిల్లా ప్రజలకు గమనిక.
అక్టోబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు లబ్ధి దారుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో 2,69,677 మందికి సుమారు రూ.113.77 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అక్టోబర్ 1వ, 3వ తేదీలలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని,అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినంతో 3 వ తేదీ పంపిణీ చేస్తామని చెప్పారు.
Similar News
News October 4, 2024
తిరుపతి SVU ఫలితాల విడుదల
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులైలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(BED) మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News October 4, 2024
పవన్ స్పీచ్‌లో తమిళ ప్రస్తావన ఎందుకు..?
తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళ ప్రస్తావనపై చర్చ జరుగుతోంది. లడ్డూ వివాదం తమిళనాడులోని ఓ కంపెనీ చుట్టూ తిరుగుతోంది. మరోసారి తమిళనాడుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. అక్కడి రాజకీయాల్లో ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇలా స్పందించారా అని అందరూ భావిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై తమిళనాడు ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
News October 4, 2024
శ్రీకాళహస్తిలో రూమ్స్ కావాలంటే ఇలా చేయండి
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వసతి గదులను ఇప్పటి వరకు సాధారణ బుకింగ్ ద్వారా భక్తులకు ఇచ్చారు. ఇక మీదట గదులు కావాలంటే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. గదులు కావాల్సినవారు స్వయంగా వచ్చి ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డుతో గదులను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.