News November 20, 2024
చిత్తూరు జిల్లా సమస్యలపై మాట్లాడిన పవన్
NTR సుజలస్రవంతి పథకం కింద 6 జిల్లాల్లో ఓ హబ్, స్పోక్ విధానంలో ప్లాంట్లను నెలకొల్పినట్లు అసెంబ్లీలో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. చిత్తూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, శ్రీకాకుళంలో 45 మదర్ ప్లాంట్లను నెలకొల్పారని, అందులో 20 నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. చిత్తూరు, KNL, NDL నుంచి పైప్ లైన్ ఏర్పాటుతో పాటు వాటినీ పునరుద్ధరిస్తామన్నారు.
Similar News
News December 13, 2024
చిత్తూరు రైతులకు ఇది తెలుసా?
మామిడి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని చిత్తూరు జిల్లాలో ఎంతమందికి తెలుసు? ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే.. ఎకరాకు రూ.35 వేలు చొప్పున ప్రధానమంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు. డిసెంబర్ 15 నుంచి మే 31 మధ్యలో గాలులు, అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బి పత్రాలతో 15వ తేదీలోగా మీ సేవలో వివరాలు నమోదు చేసుకోవాలి.
News December 13, 2024
చిత్తూరు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ప్రకటించారు. ప్రతి ఒక్క స్కూల్ ఈ నింబధన పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు నిన్ననే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 12, 2024
సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ
తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో సెలవుపై ఇప్పటికీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.