News November 14, 2024

చిత్తూరు: జీవిత ఖైదు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

image

చిత్తూరు మాజీ MLA CK.బాబుపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూకు జిల్లా కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను కొట్టేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2005 డిసెంబర్ 31న సీకే బాబు ఇంటి వద్ద మందు పాత్ర పేలింది. ఇందులో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన కేసులో 2018లో చింటూను దోషిగా తేలుస్తూ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

Similar News

News December 14, 2024

తిరుపతి: రెవెన్యూ సదస్సులో 593 ఫిర్యాదులు

image

తిరుపతి జిల్లాలో శుక్రవారం 43 ప్రాంతాలలో రెవెన్యూ సదస్సులు జరిగాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందులో సమస్యలపై 593 ఫిర్యాదులు అధికారులకు అందాయని ఆయన చెప్పారు. ఏడు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్టు పేర్కొన్నారు. మిగిలిన వాటిని నిర్దేశించిన సమయంలో అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

News December 13, 2024

CGHS వెల్ నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించాలి: తిరుపతి ఎంపీ

image

తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో కోరారు. దాని ప్రారంభానికి నిర్ణయం ప్రకటించి సంవత్సరం కావస్తున్నా.. నియామక అనుమతుల జాప్యంతో ఇంతవరకు ప్రారంభం కాలేదని  చెప్పారు. సెంటర్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య సేవలు పొందటంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

News December 13, 2024

చిత్తూరు రైతులకు ఇది తెలుసా?

image

మామిడి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని చిత్తూరు జిల్లాలో ఎంతమందికి తెలుసు? ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే.. ఎకరాకు రూ.35 వేలు చొప్పున ప్రధానమంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు. డిసెంబర్ 15 నుంచి మే 31 మధ్యలో గాలులు, అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బి పత్రాలతో 15వ తేదీలోగా మీ సేవలో వివరాలు నమోదు చేసుకోవాలి.