News January 31, 2025
చిత్తూరు: జైలు నుంచి వచ్చి మళ్లీ దొంగతనం

చోరీ కేసులో నిందితులను గురువారం చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. DSP సాయినాథ్ వివరాల మేరకు.. గతంలో చిత్తూరులో బైకులు చోరీ చేసిన కేసుల్లో ఏలూరుకు చెందిన గౌస్ మొహిద్దిన్, రైల్వేకోడూరుకు చెందిన మణికంఠ అరెస్ట్ అయ్యారు. కాగా వారు ఈనెల 16న జైలు నుంచి విడుదలై 17న చిత్తూరు సెల్వరాజ్ ఇంట్లో చోరీచేశారు. దీంతో నిందితులని పట్టుకుని 238గ్రాముల వెండి, 65 గ్రాముల బంగారు ఆభరణాలు సీజ్ చేశామన్నారు.
Similar News
News February 18, 2025
చిత్తూరులో 19, 20న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

చిత్తూరులో 19, 20 తేదీల్లో ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేశ్వరి తెలిపారు.19న మిషన్ వాత్సల్య పథకంలో ఒక కౌన్సిలర్, ఒక అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు, 20న మిషన్ శక్తి పథకంలో ఖాళీగా ఉన్న 3 మల్టీపర్పస్ హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.
News February 17, 2025

తిరుపతి నగరంలో దారుణ హత్య

తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో జగదీశ్ (40)అనే వ్యక్తిని సునీల్ అనే వ్యక్తి హత్య చేశాడు. మద్యం మత్తులో జగదీశ్ భార్యతో సునీల్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో సునీల్‌ను ప్రశ్నించడంతో పదునైన ఇనుప చువ్వతో జగదీశ్ గుండెలపై పొడిచాడు. తీవ్రగాయాలైన జగదీశ్‌ను ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అలిపిరి సీఐ రామ్ కిషోర్ విచారణ చేస్తున్నారు. సునీల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.