News June 27, 2024

చిత్తూరు: టీడీపీలో చేరిన మున్సిపల్ ఛైర్మన్

image

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాషాతో సహా 17 మంది వైసీపీ కౌన్సిలర్లు పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రొంపిచర్ల నందు గల ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి చేరారు.

Similar News

News January 26, 2025

చిత్తూరు: పెళ్లి పేరుతో వంచన

image

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై పొక్సో కేసు నమోదైన ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది. కలికిరి సీఐ రెడ్డి శేఖరరెడ్డి వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన యువతి కలికిరి మండలంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వాయల్పాడులో ఇంటర్ చదువుతోంది. ఈక్రమంలో అమ్మమ్మ ఊరిలోని జునైద్ అహమ్మద్‌తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని వంచించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News January 25, 2025

రంగంపేట క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి స్పాట్ డెడ్ 

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన రంగంపేట క్రాస్ వద్ద చోటుచేసుకుంది. తేనేపల్లి పంచాయతీ బీదరామిట్టకు చెందిన నవీన్ అనే యువకుడు రంగంపేట క్రాస్ గువ్వల కాలనీ సమీపంలో నడుచుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News January 24, 2025

చిత్తూరులో చీటింగ్ కేసు నమోదు

image

2000 వ సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వ టెండరు దక్కించుకొని సక్రమంగా పంపిణీ చేయని చర్చి వీధికి చెందిన శ్రీ షిరిడి సాయి ఎంటర్ప్రైజెస్ అధినేత కామేశ్వరరావుపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేస్తామని సీఐ జయరామయ్య తెలిపారు. 25 ఏళ్లుగా కేసు నడుస్తున్నప్పటికీ వాయిదాకు గైర్హాజరు కావడంతో నేడు దండోరా వేశామన్నారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.