News April 1, 2025

చిత్తూరు: టెన్త్ పరీక్షలకు 191 మంది గైర్హాజరు

image

చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. మొత్తం 118 పరీక్షా కేంద్రాల్లో 20,893 మంది విద్యార్థులకు గాను 20,702 మంది పరీక్షలు రాశారని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 31 పరీక్ష కేంద్రాలను చెక్ చేసిందన్నారు. 57 మంది సిట్టింగ్ స్క్వాడ్లు విధులు నిర్వహించారన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని స్పష్టం చేశారు.

Similar News

News July 8, 2025

10న చిత్తూరు జిల్లాలో PTM

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.

News July 7, 2025

చిత్తూరు: అంటీముట్టనట్లుగానే వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు?

image

ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన మాజీలు ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. YCP అధికారంలో ఉన్నన్ని రోజులు చుట్టపు MLAలుగా ఉన్న ఆ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదేతరహాలో వ్యవహరిస్తున్నారట. పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, కుప్పం ఇన్‌ఛార్జ్‌లు రాష్ట్రస్థాయిలో మినహా నియోజకవర్గ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.

News July 7, 2025

తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరు మృతి

image

తిరుపతి కపిలతీర్థం వద్ద సోమవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. భక్తులు, యాచకులపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ యాచకుడు మృతి చెందగా, మరో ఇద్దరు భక్తులు కోలుకుంటున్నారు‌. సైకో కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.