News April 25, 2024
చిత్తూరు: డిప్యూటీ మేయర్‌పై కేసు నమోదు

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన కేసులో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కొంగారెడ్డి పల్లెలోని డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డికి చెందిన కారు షెడ్డులో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని ఈ నెల 18న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో కలిసి పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎంసీసీ అధికారులు ప్రకటించారు.
Similar News
News March 16, 2026
ద్రవిడ వర్సిటీ వీసీగా చిన్న మల్లయ్య బాధ్యతలు

కుప్పం ద్రవిడ వర్సిటీ వీసీగా ఆచార్య చిన్న మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ప్రభుత్వం వీసీగా నియమించింది. ద్రవిడ వర్సిటీని విద్య పరిశోధన పరిపాలన రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ తెలిపారు. వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
News March 16, 2026
సెలవులో చిత్తూరు కలెక్టర్

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
News March 16, 2026
చిత్తూరు: నేటి నుంచి ‘రైతన్న-మీకోసం’ వారోత్సవాలు

జిల్లాలో సోమవారం నుంచి ‘రైతన్నా- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం నుంచి సంపద సృష్టి దిశగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.


