News November 21, 2024
చిత్తూరు: డిసెంబర్ 20 లోపు సీసీ రోడ్లు పూర్తి చేయాలి
డిసెంబర్ 20 లోపు సీసీ రోడ్లు పూర్తిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో1500 CC.రోడ్డు పనులు మంజూరు కాగా 1018 పనులు గ్రౌండింగ్ కాబడ్డాయని తెలిపారు. ఇందులో 406 పనులు పూర్తి కాగా 612 పనులు పురోగతిలో కలవని తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 12, 2024
తిరుపతి జిల్లాలోనూ సెలవు
భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు: చిత్తూరు JC
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఇవాళ సెలవు ప్రకటించించన విషయం తెలిసిందే. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరాదన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.
News December 12, 2024
చిత్తూరు: ప్రాణం తీసిన యువకుడి వేధింపులు
ప్రేమించమని వేధించడంతో ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం యాదమరి(M) పాచిగుంటలో జరిగింది. ఎస్ఐ ఈశ్వర్ వివరాల మేరకు.. కీర్తన(17)కు ఇటీవల వివాహమైంది. మైనర్ కావడంతో ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన సంతోశ్ కుమార్ ప్రేమించాలని వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన కీర్తన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.