News August 22, 2024
చిత్తూరు: తల్లితో సహజీవం.. కూతురితో అసభ్య ప్రవర్తన

చిత్తూరులో ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. టూటౌన్ CI.నెట్టికంఠయ్య కథనం..తేనబండ పక్కనున్న బోడిగుట్టకు చెందిన నవీన్ అనేవ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె కుమార్తె(14)తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. మహిళ పనికి వెళ్లి వచ్చేసరికి, బాలిక ఏడుస్తోంది. అడిగితే తనపై నవీన్ లైంగికదాడికి ప్రయత్నించాడని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News December 4, 2025
చిత్తూరు జిల్లాలో CIల బదిలీ

చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు అర్బన్ సీఐ కె.మురళీమోహన్ను స్పెషల్ బ్రాంచ్ సీఐగా బదిలీ చేశారు. పూతలపట్టు అర్బన్ సీఐ కృష్ణ మోహన్‌ను వీఆర్‌కు పంపారు. చిత్తూరులో వీఆర్‌లో ఉన్న డి.గోపిని పూతలపట్టు అర్బన్ సీఐగా నియమించారు.
News December 4, 2025
రాష్ట్ర స్థాయి విజేతలుగా చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు

గుంటూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల (పారా స్పోర్ట్స్)పాఠశాల బ్యాడ్మింటన్ మీట్లో రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించారు. డిసెంబర్ 1, 2వ తేదీల్లో నిర్వహించిన ఈ క్రీడల్లో చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తన ఆఫీసుకు ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.