News October 15, 2024

చిత్తూరు: దుకాణాలు దక్కించుకున్న 12 మంది మహిళలు

image

104 మద్యం దుకాణాలకు నిర్వహించిన లాటరీలో జిల్లాలో 12 మంది మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. చిత్తూరులో యామిని, కీర్తన, బంగారుపాళ్యంలో పల్లవి (2 షాపులు), ఐరాలలో లక్ష్మి, వెదురుకుప్పంలో పార్వతి, శాంతమ్మ, బైరెడ్డిపల్లెలో భారతి, గుడుపల్లెలో ప్రభావతి, శాంతిపురంలో పుష్ప, రామకుప్పంలో ధనలక్ష్మి, పులిచెర్లలో సరస్వతి దుకాణాలను దక్కించుకున్నారు.

Similar News

News November 5, 2025

తిరువన్నామలైలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలైకు బుధవారం వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆలయ మర్యాదలతో సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట వైసీపీ చిత్తూరు ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి ఉన్నారు.

News November 5, 2025

గిరిజనులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు: చిత్తూరు కలెక్టర్

image

జిల్లాలోని 411 మంది గిరిజనులకు నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీపం-2 పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ కాలనీలలో ప్రతి ఇంటిని సందర్శించి అర్హతలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

News November 4, 2025

సోమల: ముళ్ల పొదలలో నవజాత శిశువు

image

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ముళ్ల పోదలలో గుర్తు తెలియని వ్యక్తులు పడవేసిన ఘటన సోమల మండలంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ నడింపల్లి సమీపంలో శిశువును గుర్తించిన స్థానికులు సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స ఇచ్చిన తరువాత ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు చిన్నారిని అంబులెన్స్‌లో చిత్తూరు శిశు విహార్‌కు తరలించారు.