News February 14, 2025

చిత్తూరు: ‘ధర్నాకు అనుమతులు లేవు’

image

చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం వైసీసీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు టౌన్ డీఎస్పీ సాయినాథ్ స్పందిస్తూ ధర్నాకు పోలీసులు ఎటువంటి ముందస్తు అనుమతులు ఇవ్వలేదన్నారు. ధర్నాకు హాజరు కావాలని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అనుసరించి ధర్నాకు సహకరించిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని గురువారం డీఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

Similar News

News March 24, 2025

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు: SP 

image

ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. అధిక మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తే డయల్ 112కు గాని, వాట్సాప్ నెంబర్ 9440900005కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

News March 24, 2025

PES స్నాతకోత్సవంలో మాజీ చీఫ్ జస్టిస్ రమణ

image

కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో 17వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ హాజరైయ్యారు. పీఈఎస్ విద్యా సంస్థ అధినేత దొరస్వామి నాయుడుకు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో వైద్య విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.

News March 24, 2025

పోలీస్ కుటుంబాలు నన్ను తిట్టుకుంటున్నాయి: MLA

image

చిత్తూరు జిల్లాలో పోలీసు కుటుంబాలు తనను తిట్టుకుంటున్నాయని పలమనేరు MLA అమర్‌నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య అనంతరం వైసీపీకి అనుకూలంగా పని చేసిన వారిని మార్చమని అడిగితే.. SP ఇష్టానికి బదిలీలు చేశారని ఆరోపించారు. దీంతో వారి భార్యా పిల్లలు తనను ద్వేషిస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు శాశ్వతం కాదని, అధికారులే శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!