News October 1, 2024
చిత్తూరు: ‘నవంబర్ 15 లోపు అందజేయాలి’

ST గ్రామాలలో బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేనివారికి నవంబర్ 15లోపు అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం వాటి మంజూరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 588 హాబిటేషన్లో సుమారు 60 వేల మంది ఉన్నారని.. వారికి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నట్టు కలెక్టర్ చెప్పారు. వాటిపై చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News November 12, 2025
చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు గమనిక

జిల్లాలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 రుసుంతో డిసెంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు, రూ.500తో డిసెంబర్ 11 నుంచి 15 వరకు అవకాశం ఉంటుందన్నారు.
News November 12, 2025
చిత్తూరులో ఏక్తా దివస్ ర్యాలీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం చిత్తూరులో రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పాల్గొన్నారు. గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.
News November 12, 2025
నేడు జిల్లా వ్యాప్తంగా 10,168 గృహ ప్రవేశాలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 10,168 గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మరోవైపు PMAY 2.O క్రింద 2,472 ఇళ్లులు మంజూరు కాగా వాటి లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1లక్షను అందించనుంది.


