News February 13, 2026

చిత్తూరు: నీటి ఎద్దడి సమరం..అధికార యంత్రాంగం సన్నద్ధమా?

image

వేసవి ప్రారంభం కాకముందు ఎండలు మండుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం సగటు భూగర్భ నీటి మట్టం 8.04 మీటర్లు ఉండగా, గతేడాది 8.94 మీటర్లు ఉండేది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో, పలమనేరు, బైరెడ్డి మండలాల్లోని అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఎదుర్కొనే ప్రాంతాలపై RWS అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Similar News

News March 9, 2026

పాకాల రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

image

పాకాల రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు ట్రైన్ కిందపడి వ్యక్తి మృతి చెందాడు. పాకాల భారతంమిట్ట ఏడవ క్రాస్ వీధికి చెందిన విశ్వనాథ నాయుడు సోమవారం హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 9, 2026

చిత్తూరు: పెరిగిన ధరలు.. ఆందోళనలో ప్రజలు

image

పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో పెరిగిన గ్యాస్ ధరలు సామాన్య ప్రజానీకానికి భారంగా మారాయి. చిత్తూరు జిల్లాలో 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 6 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు, పొందిన నాటి నుంచి 21 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

News March 9, 2026

చిత్తూరు: 18 వరకు గడువు పెంపు

image

పంచాయతీలో ఓటరు ముసాయిదా జాబితా ప్రచురణ గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు డీపీఓ సుధాకర్ రావు తెలిపారు. మార్చి 9కి జాబితాను ప్రచురించాలని ముందుగా ఉన్నతాధికారులు గడువు ఇచ్చారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా నమోదులో ఆలస్యం అవుతోంది. ఇంకా 10% మ్యాపింగ్ ప్రక్రియ చేయాల్సి ఉందన్నారు. ఇచ్చిన గడువులోగా వాటిని పూర్తి చేస్తామన్నారు.