News March 16, 2026
చిత్తూరు: నేటి నుంచి ‘రైతన్న-మీకోసం’ వారోత్సవాలు

జిల్లాలో సోమవారం నుంచి ‘రైతన్నా- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం నుంచి సంపద సృష్టి దిశగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 13, 2026
చిత్తూరు జిల్లా విద్యార్థులకు గమనిక

చిత్తూరు జిల్లాలో ఆసక్తి ఉన్న విద్యార్థులు డీఈఈ సెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాజేంద్రప్రసాద్ సూచించారు. ఇంటర్ పూర్తిచేసిన వాళ్లు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలన్నారు. 17 ఏళ్లు నిండాలని, గరిష్ఠ వయోపరిమితి లేదని తెలిపారు. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 13, 2026
చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలో విషాదం నెలకొంది. రామానాయుడు పల్లికి చెందిన బాబు అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. తన భూమిని అన్యాయంగా ఆక్రమించడంతో పాటు కేసుల పేరుతో వేధించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వేధించడంతో ఇలా చేశారని సమాచారం. ఆత్మహత్యకు ముందు రైతు ఓ లేఖ రాశారని స్థానికులు చెబుతున్నారు.
News April 12, 2026
తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.


