News April 3, 2025

చిత్తూరు: నేటి నుంచి స్పాట్ వాల్యుయేషన్

image

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుంచి టెన్త్ మూల్యాంకనం జరగనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. 10వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది.  1,244 మంది టీచర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతి టీచర్ తప్పనిసరిగా మూల్యాంకన విధులకు హాజరు కావాలన్నారు. పేపర్లు కరెక్షన్ చేసే సమయంలో సెల్‌ఫోన్ వాడరాదని స్పష్టం చేశారు.

Similar News

News April 12, 2025

పూతలపట్టు ఎమ్మెల్యేకు తానా ఆహ్వానం

image

పూతలపట్టు MLA మురళీ మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికాలోని అతి పెద్ద భారతీయ అమెరికన్ సంస్థగా గుర్తింపు పొందిన తెలుగు‌ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధులు ఆయన్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు అమెరికాలోని నోవో మిచిగన్‌లో జరిగే సదస్సుకు హాజరు కావాలని కోరారు.

News April 12, 2025

గణనాధుని దర్శించుకున్న హీరో వరుణ్ 

image

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ నటుడు వరుణ్ సందేశ్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.  

News April 11, 2025

చిత్తూరులో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతి

image

చిత్తూరులో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని దురాలోచనలను పోగొట్టడానికి జ్యోతిరావ్ ఫూలే అపారమైన కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల బీసీ కన్వీనర్ షణ్ముగం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!