News February 13, 2025
చిత్తూరు నేతలకు కీలక పదవులు ఇచ్చిన జగన్

చిత్తూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా కే.పీ. శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే చిత్తూరు రూరల్ అధ్యక్షుడిగా జయపాల్, గుడిపాల మండల అధ్యక్షుడిగా జై ప్రకాశ్ని నియమించారు. తమకు అవకాశం కల్పించిన జగన్, విజయనందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.
Similar News
News December 21, 2025
చిత్తూరు మామిడి రైతులకు ముఖ్య గమనిక

మామిడి రైతులకు డిసెంబర్ నెల కీలకమని చంద్రగిరి HO అధికారిణి శైలజ అన్నారు. పూతదశకు ముందు నీటి తడులు ఆపితే చెట్టు ఒత్తిడికి లోనై మంచి పూత వస్తుందన్నారు. పిండి పురుగు పైకి ఎక్కకుండా కాండం చుట్టూ 25 సెం.మీ ప్లాస్టిక్ కవర్ కట్టి గ్రీజు రాయాలని, పూత సమంగా రావడానికి 13-0-45 నిష్పత్తిలో పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి 10 గ్రా.కలిపి పిచికారీ చేయాలన్నారు. పాదుల్లో కలుపు తీసి,ఎండిన కొమ్మలు కత్తిరించాలన్నారు.
News December 21, 2025
సంక్రాంతి వస్తోంది.. చిత్తూరు జిల్లాలో జాగ్రత్త

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మహిళలు ఉదయాన్నే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడుతున్నారు. మగవాళ్లు అప్పుడే కోడిపందేలకు తెరలేపారు. పోలీసులు అయితే సైలెంట్గా ఉండరు కదా? వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. బైరెడ్డిపల్లి(M) నెల్లిపట్ల పంచాయతీ కక్కనూరు సమీపంలో కోడిపందెం స్థావరంపై SI చందన ప్రియ దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని 18బైకులు, 3కోళ్లు సీజ్ చేశారు. సో కోడిపందేలకు వెళ్లకండి.
News December 20, 2025
చిత్తూరు: రేపు 2 లక్షల మందికి టీకాలు.!

ఈఏడాది జిల్లాలో 2,21,502 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజులు ఈ ప్రోగ్రాం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 5,794 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఈ కేంద్రాల వద్ద, మిగిలిన రెండు రోజులు సిబ్బంది ఇంటింటికీ తిరిగి వేయనున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. పేరంట్స్ చిన్నారులకు తప్పక టీకాలు వేయించాలి.


