News August 30, 2024

చిత్తూరు: ‘పంచాయితీకి పిలిచి కాళ్లు విరగ్గొట్టారు’

image

పిల్లల గొడవపై పంచాయితీ పెట్టి కాళ్లు విరగ్గొట్టిన ఘటన పీటీఎం మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. కమ్మచెరువుకు చెందిన నరేశ్ ఆటో నడుపుతుంటాడు. తన ఇద్దరు పిల్లలు గ్రామానికి చెందిన నరసింహులు పిల్లలతో నిన్న గొడవపడ్డారని రాత్రి పెద్ద మనుషులతో నరసింహులు పంచాయతీ పెట్టించాడు. అక్కడ తన పిల్లల్ని కొడుతుంటే నరేశ్ తిరగబడ్డాడు. దీంతో రెచ్చిపోయిన నరసింహులు వర్గం నరేశ్‌పై కర్రలతో దాడిచేసి కాళ్లు విరగ్గొట్టారు.

Similar News

News October 27, 2025

చిత్తూరులో పటిష్ఠ బందోబస్తు

image

గత మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సోమవారం నిందితులకు శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో చిత్తూరులో పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చిత్తూరు 1, 2 టౌన్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కోర్టు పరిధిలో లాయర్లు సిబ్బందిని తప్ప మరెవరిని అనుమతించామన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.

News October 26, 2025

చిత్తూరు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

image

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు సెలవు పాటించాలని అందులో ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను నదులు, కాలువలు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

News October 26, 2025

ఆయుధాల ప్రదర్శనను ప్రారంభించిన చిత్తూరు SP

image

జిల్లా AR కార్యాలయంలో పోలీసులు వినియోగించే ఆయుధాల ప్రదర్శనను SP తుషార్ డూడీ ఆదివారం ప్రారంభించారు. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులకు స్వయంగా ఆయుధాలు గురించి వివరించారు. పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా ప్రతి ఏటా రెండు రోజులపాటు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. పోలీసులు నిత్యజీవితంలో ఎదుర్కొనే సవాళ్లు, ఉపయోగించే ఆయుధాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడవచ్చన్నారు.