News August 30, 2024
చిత్తూరు: ‘పంచాయితీకి పిలిచి కాళ్లు విరగ్గొట్టారు’
పిల్లల గొడవపై పంచాయితీ పెట్టి కాళ్లు విరగ్గొట్టిన ఘటన పీటీఎం మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. కమ్మచెరువుకు చెందిన నరేశ్ ఆటో నడుపుతుంటాడు. తన ఇద్దరు పిల్లలు గ్రామానికి చెందిన నరసింహులు పిల్లలతో నిన్న గొడవపడ్డారని రాత్రి పెద్ద మనుషులతో నరసింహులు పంచాయతీ పెట్టించాడు. అక్కడ తన పిల్లల్ని కొడుతుంటే నరేశ్ తిరగబడ్డాడు. దీంతో రెచ్చిపోయిన నరసింహులు వర్గం నరేశ్‌పై కర్రలతో దాడిచేసి కాళ్లు విరగ్గొట్టారు.
Similar News
News September 7, 2024
తిరుమల క్యూలైన్లో మహిళ మృతి
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గుండెపోటుతో మహిళ మృతి చెందింది. కడపకు చెందిన ఝాన్సీ (32) శనివారం ఉదయం సర్వదర్శనం క్యూలైన్ లో గుండెపోటుకు గురై చనిపోయింది. అయితే అంబులెన్స్ గంట ఆలస్యంగా వచ్చిందని..సకాలంలో అందుబాటులో ఉంటే తన బిడ్డ బతికేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.తమ కుమార్తె మృతికి టీటీడీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని బోరున విలపించారు.
News September 7, 2024
సత్యవేడు MLAపై అత్యాచార కేసు..UPDATE
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధిత మహిళను పోలీసులు శుక్రవారం ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ చేయడానికి చికిత్సలు చేయించుకోమన్నారు. అయితే ఆమె పరీక్షలకు నిరాకరించినట్లు సమాచారం. సాక్ష్యాలు తారుమారు అవుతాయని వైద్యులు, పోలీసులు చెప్పినా వినకుండా వెళ్లిపోయిందన్నారు. మరో రెండురోజుల్లో పరీక్షలకు వస్తానని చెప్పారన్నారు.
News September 7, 2024
చిత్తూరు: మీరు చూపించిన సేవా భావం అందరికీ ఆదర్శం: SP
హెడ్ కానిస్టేబుల్ చూపించిన సేవాభావం అందరికీ ఆదర్శమని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ వరద బాధితులకు రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయాన్ని ఎస్పీకి అందజేయడంతో హెడ్ కానిస్టేబుల్‌ను అభినందించారు.