News February 20, 2025
చిత్తూరు: పకడ్బందీగా పబ్లిక్ పరీక్షలు

జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటర్లో 30,652 మంది విద్యార్థులు, పదో తరగతిలో 21,248 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణలో చీటింగ్‌కి పాల్పడితే ఎగ్జామినేషన్ యాక్ట్ కింద చర్యలు తప్పవన్నారు.
Similar News
News March 26, 2025
రేపే ఉప ఎన్నికలు.. కూటమికి విజయం దక్కేనా.?

చిత్తూరు జిల్లా పరిధిలో బుధవారం MPP ఉప ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని రామకుప్పం, తవణంపల్లి, సదుం, విజయపురం (వైస్ ఎంపీపీ), పెనుమూరు (కో-ఆప్షన్ సభ్యులు)లకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి చూస్తోంది. సదుం సహా పలు చోట్ల YCP, కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు JC విద్యాధరి స్పష్టం చేశారు.
News March 26, 2025
చిత్తూరు జిల్లాలో భయపెడుతున్న భానుడు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉ.11కే భానుడు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాడు. మంగళవారం తవణంపల్లెలో దాదాపు 40, గంగవరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరులో 38, నగరిలో 37, పలమనేరులో 37.5, కుప్పంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి.
News March 26, 2025
చిత్తూరు జిల్లాలో RIలకు పదోన్నతి

చిత్తూరు జిల్లాలో RIలకు DTలుగా పదోన్నతిని కల్పిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ☞ పెద్దపంజాణి డీటీ-యుగేశ్☞ ఇనాం డీటీ-రాజశేఖర్☞ పుంగనూరు ఎన్నికల డీటీ-మోహన్ ☞ చౌడేపల్లి డీటీ- నందినిదేవి☞ కుప్పం సీఎస్టీ-రేఖ ,జోత్స్న ☞ కుప్పం ఈడీటీ- జోత్స్న☞ పలమనేరు సీఎస్‌ఈటీ-శిరీష☞ కుప్పం రీసర్వే డీటీ-నరేంద్ర☞ వీకోట రీసర్వే డీటీ-శోభ ☞ సోమల డీటీగా మధుసూదన్‌కు పోస్టింగ్ ఇచ్చారు.