News March 18, 2025

చిత్తూరు: పాఠశాల పని వేళల్లో మార్పు

image

పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పని వేళలను మార్పు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 5 వరకు పాఠశాలలు నడపాలని గతంలో ఇచ్చిన ఉత్తర్లను మార్పు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 5 వరకు పని వేళలను మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ పని వేళల్లో పాఠశాలలు నిర్వహించాలని సూచించారు.

Similar News

News March 18, 2025

వారి పేర్లు తొలగించండి: సీపీఎం

image

చిత్తూరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరులోని రాజకీయ పార్టీ నాయకులతో డీఆర్వో మోహన్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 20వేల మంది మరణించిన వారి పేర్లు ఓటర్ లిస్ట్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని తొలగించమని పదే పదే చెప్పినా.. తీసేయకపోవడం సరికాదన్నారు. ఒకే వ్యక్తి పలు నియోజకవర్గాల్లో ఓటరుగా ఉన్నారని చెప్పారు.

News March 18, 2025

చిత్తూరులో భారీగా పోలీసుల బదిలీ

image

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్‌కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.

News March 18, 2025

వెదురుకుప్పం: మహేశ్ మృతదేహాన్ని అప్పగించాలంటూ నిరసన

image

వెదురుకుప్పం మండలంలోని కొమరగుంట గ్రామానికి చెందిన మహేశ్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. తాను నివసిస్తున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. మహేశ్ మృత దేహాన్ని అప్పగించాలంటూ వెదురుకుప్పం -పచ్చికాపల్లం రహదారి మార్గంలో కొమరగుంట క్రాస్ రోడ్డులో మంగళవారం బంధువుల ఆందోళన చేపట్టారు. మహేశ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!