News February 28, 2025

చిత్తూరు- పుత్తూరు హైవేపై ప్రమాదం.. MLA బాబాయ్ దుర్మరణం

image

కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన చొక్కలింగం(70) నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెదురుకుప్పం మండలం చవటగుంటకు చెందిన గోవర్ధన్ బైకుపై కార్వేటినగరం నుంచి పళ్లిపట్టుకు వెళుతూ చొక్కలింగంను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో చొక్కలింగం అక్కడికక్కడే మృతి చెందగా.. గోవర్ధన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చిన్నాన్నగా స్థానికులు గుర్తించారు.

Similar News

News March 26, 2025

రేపే ఉప ఎన్నికలు.. కూటమికి విజయం దక్కేనా.?

image

చిత్తూరు జిల్లా పరిధిలో బుధవారం MPP ఉప ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని రామకుప్పం, తవణంపల్లి, సదుం, విజయపురం (వైస్ ఎంపీపీ), పెనుమూరు (కో-ఆప్షన్ సభ్యులు)లకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి చూస్తోంది. సదుం సహా పలు చోట్ల YCP, కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు JC విద్యాధరి స్పష్టం చేశారు.

News March 26, 2025

చిత్తూరు జిల్లాలో భయపెడుతున్న భానుడు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉ.11కే భానుడు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాడు. మంగళవారం తవణంపల్లెలో దాదాపు 40, గంగవరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరులో 38, నగరిలో 37, పలమనేరులో 37.5, కుప్పంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి.

News March 26, 2025

చిత్తూరు జిల్లాలో RIలకు పదోన్నతి

image

చిత్తూరు జిల్లాలో RIలకు DTలుగా పదోన్నతిని కల్పిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ☞ పెద్దపంజాణి డీటీ-యుగేశ్☞ ఇనాం డీటీ-రాజశేఖర్☞ పుంగనూరు ఎన్నికల డీటీ-మోహన్ ☞ చౌడేపల్లి డీటీ- నందినిదేవి☞ కుప్పం సీఎస్టీ-రేఖ ,జోత్స్న ☞ కుప్పం ఈడీటీ- జోత్స్న☞ పలమనేరు సీఎస్‌ఈటీ-శిరీష☞ కుప్పం రీసర్వే డీటీ-నరేంద్ర☞ వీకోట రీసర్వే డీటీ-శోభ ☞ సోమల డీటీగా మధుసూదన్‌కు పోస్టింగ్ ఇచ్చారు.

error: Content is protected !!