News July 9, 2024

చిత్తూరు: పెద్దిరెడ్డిపై గుంటూరు ఏఎస్పీకి ఫిర్యాదు

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిరంగిపురం మండలానికి చెందిన షేక్ జహంగీర్ గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్వే రాళ్లు సరఫరాకు గత ప్రభుత్వం తనకు కాంట్రాక్టు ఇచ్చిందని, ఆపై అప్పటి మంత్రి పెద్దిరెడ్డి వాటిని కొనుగోలు చేయొద్దని అధికారులను ఆదేశించారన్నారు. దీనిపై అడిగితే పెద్దిరెడ్డి బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.

Similar News

News February 26, 2026

పనులు పరిశీలించిన చిత్తూరు కలెక్టర్

image

త్వరలో చిత్తూరులో ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయం పనులను కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణ పనులు, తరగతి గదుల సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

News February 26, 2026

చిత్తూరులో ఆ అధికారులంతా ట్రాన్స్‌ఫర్

image

2018 గ్రూప్-1 బ్యాచ్ అధికారులను ప్రాధాన్యత పోస్టుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది RDOలు, 25 మంది DSPలను బదిలీ చేస్తూ హెడ్ క్వార్టర్స్ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు జిల్లా కుప్పం, నగరి RDOలు శ్రీనివాసులు రాజు, భవాని శంకరి, నగరి DSP మహమ్మద్ అజీజ్, సాంఘిక సంక్షేమశాఖ DD విక్రమ్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారు

News February 26, 2026

చిత్తూరు: పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్

image

పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-5 నుంచి గ్రేడ్-4కు ప్రమోషన్ ఇచ్చారు. చిత్తూరు DPO సుధాకర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లాలో 23 మందికి ప్రమోషన్ రాగా.. అన్నమయ్య జిల్లాలో పదోన్నతి పొంది అదనంగా ఉన్న 14 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో 10 మందికి ప్రమోషన్ ఇచ్చారు. పలు గ్రేడ్లలో ఉన్న 10 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.