News July 4, 2024
చిత్తూరు: పెళ్లైన 3నెలలకే వేధింపులు

పెళ్లైన 3 నెలలకే నవ వధువును కట్నం కోసం వేధించిన భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె తాలూకా ఎస్సై రవికుమార్ కథనం మేరకు.. తిరుపతికి చెందిన యశ్వంత్ కుమార్(25) 3నెలల క్రితం మదనపల్లె మండలం సీటీఎం రేగంటివారిపల్లెకు చెందిన నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. 3నెలలకే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వరలక్ష్మి, వెంకట సూర్య నారాయణ వేధించడంతో బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
Similar News
News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.
News December 1, 2025
చిత్తూరులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. పలువురు సమస్యలను ఆయన నేరుగా తెలుసుకున్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపారు. సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో డీఆర్వో మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
News December 1, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కురిసిన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. సోమలలో అత్యధికంగా 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గుడిపాలలో 2.4 మి.మీ పడింది. కార్వేటినగరంలో 19. 2, పులిచెర్లలో 15.8, విజయపురంలో 15.4, రొంపిచర్లలో 14.8, సదుంలో 13, వెదురుకుప్పంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.


