News July 17, 2024
చిత్తూరు: పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

చిత్తూరు జిల్లాలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. కుప్పం నుంచి కేజీఎఫ్ బయల్దేరిన బస్సుకు శాంతిపురం మండలం రాళ్లబుదుగురు సమీపంలో ఎదురుగా ఓ బైకు వేగంగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News November 2, 2025
చిత్తూరు: వారికి రేపు పింఛన్ల పంపిణీ

చిత్తూరు జిల్లాలో తొలిరోజే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 95.20 శాతం పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2,67,786 మంది లబ్ధిదారులు ఉండగా 2,54,943 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛను సొమ్ము అందజేశారు. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో మిగిలిన 12,843 మందికి సోమవారం పింఛన్ ఇవ్వనున్నారు.
News November 2, 2025
చిత్తూరు: ఖాళీ పోస్టులకు దరఖాస్తులు

చిత్తూరు సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీసీ వెంకటరమణ కోరారు. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనుల పర్యవేక్షణ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సైట్ ఇంజినీర్ పోస్టులు 3, డ్రాఫ్ట్ మెన్ పోస్టులు రెండింటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తామని.. ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
News November 2, 2025
పుత్తూరు: ‘ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట’

కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులో ఆయన శనివారం మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద 9 మంది తొక్కిసాలాటలో మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి సామాన్య ప్రజలకు, భక్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు.


