News May 10, 2024

చిత్తూరు: ప్రచారం @ మరో 24 గంటలే

image

ఎన్నికల ప్రచార పర్వం మరో 24 గంటల్లో ముగియనుంది. ఇన్ని రోజులు అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున స్టార్ క్యాంపెయినర్ల రాకతో చిత్తూరు జిల్లా వార్తల్లో నిలిచింది. ఈ సారి జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాలని కూటమి, పట్టు నిలుపుకోవాలని వైసీపీ తహతహలాడుతున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుండగా అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.

Similar News

News February 9, 2025

చిత్తూరు: మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు

image

చిత్తూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన పది మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. తొలుత దరఖాస్తులకు ఐదో తేదీ వరకే గడువు విధించడంతో 13 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువును 8వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. దరఖాస్తుదారులకు సోమవారం లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

News February 9, 2025

చిత్తూరు: రెండు రోజుల క్రితం పెళ్లి.. ఇంతలోనే

image

రెండు రోజుల క్రితం పెళ్లి.. కొత్త దంపతులతో సహా పలువురు వధువు ఇంటికి విందుకు బయలుదేరారు. సరదాగా సాగుతున్న వారి ప్రయాణాన్ని లారీ రూపంలో వచ్చిన ప్రమాదం ఛిద్రం చేసింది. GDనెల్లూరు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. యాదమరి(M) దళితవాడకు చెందిన రామన్‌కు కవితతో శుక్రవారం పెళ్లి జరిగింది. శనివారం వారు ఆటోలో వధువు ఇంటికి వెళుతుండగా లారీ ఢీకొట్టింది. 13 మంది గాయపడగా ఒకరు మృతి చెందారు.

News February 9, 2025

నేటి నుంచి కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలు

image

కుప్పం-బెంగళూరు మధ్య నేటి నుంచి యధావిధిగా రైళ్ల రాకపోకలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కుప్పం రైల్వే ట్రాక్ పనుల కారణంగా గడిచిన 15 రోజులుగా కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకల్లో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కుప్పం ప్రాంతానికి చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఆదివారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

error: Content is protected !!