News March 10, 2025

చిత్తూరు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 41 ఫిర్యాదులు

image

చిత్తూరు నగరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 41 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Similar News

News March 20, 2025

చిత్తూరు: KGBVలో ప్రవేశాలు.. అర్హతలు ఇవే

image

చిత్తూరు జిల్లాలోని 8 కేజీబీవీల్లో 6, 11వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సమగ్ర శిక్ష APC వెంకటరమణ మాట్లాడుతూ.. అలాగే 7, 8, 9, 10, 12వ తరగతుల్లో మిగిలిన సీట్లకు ఈనెల 22వ తేదీ నుంచి ఏప్రిల్11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్ అవుట్, SC, ST, మైనారిటీ, బీపీసీ బాలికలు దరఖాస్తుకు అర్హులని చెప్పారు. ఇతర వివరాలకు 7075159996లో సంప్రదించాలన్నారు.

News March 20, 2025

పుంగనూరు: కోర్టులో లొంగిపోయిన నిందితురాలు

image

పుంగనూరు మండలంలోని కృష్ణాపురంలో రామకృష్ణ హత్యకేసులో నిందితురాలైన రజిని బుధవారం న్యాయవాది శివప్పనాయుడు ద్వారా కోర్టులో లొంగిపోయింది. రికార్డులు పరిశీలించిన అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి వంశీకృష్ణ ఆమెను జుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ హత్య కేసులో నిందితులైన త్రిలోక, మహేశ్‌ను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ చెప్పారు.

News March 20, 2025

చిత్తూరు: కురబ కులస్థుల పెద్ద జాతరకు రావాలని YS జగన్‌కు ఆహ్వానం

image

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం జ్యోగ్గానూరులో కురబ కులస్థుల సిద్దేశ్వర, వీరేశ్వర పెద్ద జాతరకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు జడ్పీటీసీ కృష్ణమూర్తి, మునెప్ప, రవిలు కోరారు. ఏడేళ్లకు ఒకసారి వైభవంగా పెద్ద జాతరను నిర్వహిస్తారు. బుధవారం విజయవాడలో జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. కురబ కులస్థులకు ఆయన ఈ సందర్భంగా జాతర శుభాకాంక్షలు తెలిపినట్లు వారు తెలిపారు. కులస్థుల – సిద్దేశ్వర – సందర్భంగా

error: Content is protected !!