News December 12, 2024

చిత్తూరు: ప్రాణం తీసిన యువకుడి వేధింపులు

image

ప్రేమించమని వేధించడంతో ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం యాదమరి(M) పాచిగుంటలో జరిగింది. ఎస్ఐ ఈశ్వర్ వివరాల మేరకు.. కీర్తన(17)కు ఇటీవల వివాహమైంది. మైనర్ కావడంతో ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన సంతోశ్ కుమార్ ప్రేమించాలని వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన కీర్తన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

Similar News

News January 24, 2025

చిత్తూరు ఎస్పీకి ఉత్తమ జాతీయ అవార్డు

image

గత అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకు అవార్డు వచ్చింది. ఉత్తమ ఎన్నికల నిర్వహణ జాతీయ అవార్డుకు ఆయన సెలెక్ట్ అయ్యారు. విజయవాడలో 25న జరిగే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సభలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎస్పీ అవార్డు వచ్చిందని పలువురు పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

News January 23, 2025

తిరుమలలో ముగిసిన అధ్యయనోత్సవాలు

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గ‌తేడాది డిసెంబరు 30వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు. 25 రోజులుగా శ్రీవారి శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదించారు.

News January 23, 2025

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం: కలెక్టర్

image

76వ భారత గణతంత్ర వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.  ఈ నెల 26న నిర్వహించే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.