News November 27, 2024

చిత్తూరు: ప్రేమజంటకు పెళ్లి చేసిన గ్రామస్థులు

image

<<14718200>>ప్రేమ జంటకు<<>> గ్రామస్థులు పెళ్లి చేసిన ఘటన బుధవారం రొంపిచర్లలో జరిగింది. భాకరాపేటకు చెందిన ప్రసన్న, గానుగచింతకు చెందిన రెడ్డప్ప డిగ్రీ చదువుకుంటూ ప్రేమించుకున్నారు. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు పెళ్లి  కుమార్తె తల్లి ఆమె మెడలోని తాళి తెంచేసింది. అయితే ప్రియుడే కావాలని ఆమె అతని దగ్గరకు వెళ్లడంతో గ్రామస్థులు ఆలయంలో ప్రేమజంటకు మళ్లీ తాళి కట్టించారు.

Similar News

News October 25, 2025

కోడి తెచ్చిన తంటా.. ఎనిమిది మందిపై కేసులు

image

కోడి తెచ్చిన తంటా.. పుంగనూరులో ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. SI రమణ వివరాల మేరకు.. పట్టణంలోని రహ్మత్ నగర్లో పక్కపక్కనే భాస్కర్ నాయుడు, ఖాదర్ వలీ కుటుంబాలు ఉంటున్నాయి. భాస్కర్‌కు చెందిన కోడి ఖాదర్ వలీ ఇంటి వద్ద ఇది వరకు రెట్ట వేయడంతో గొడవ పడ్డారు. శుక్రవారం మరోసారి ఇదే రిపీట్ కావడంతో ఇరుకుటుంబాలు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News October 24, 2025

పౌల్ట్రీ రంగ రైతులతో కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని పౌల్ట్రీ రంగం రైతులు, కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి రైతులు, కంపెనీలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం తరఫున సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తామని వివరించారు. రైతులకు కంపెనీలు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రాయితీల సక్రమంగా అందించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News October 24, 2025

చిత్తూరు జిల్లాలో 177 ఎకరాలలో దెబ్బతిన్న వరి పంట

image

వర్షాల కారణంగా జిల్లాలో 177 ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖాధికారులు తెలిపారు. 12 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో 172 మంది రైతులు సాగు చేసిన వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 70 ఎకరాల్లో పైరు దెబ్బతినగా, చౌడేపల్లె మండలంలోని ఒకే గ్రామంలో 40 ఎకరాలు, యాదమరి మండలంలోని ఐదు గ్రామాల్లో 12.25 ఎకరాలు సాగు చేసిన వరి పైరు దెబ్బతింది.